తాలిబన్లు.. కాశ్మీరు.. మరి ఇండియా ఇక మరో ఇజ్రాయేల్ లా..
Afghanistan news :ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తరువాత పాకిస్తాన్ కీలుబొమ్మలు అయిన తాలిబన్లు కాశ్మీర్ విషయం లో జోక్యం చేసుకుంటామని తేల్చి చెప్పేశారు. మరోపక్క రాజ్య విస్తరణ కాంక్ష తో చైనా దురాక్రమణ యత్నాలు. అందులో భాగంగా శ్రీలంక లో చైనా పాగా. లడఖ్, గాల్వాన్ లోయ గొడవ కు ముందే ఎప్పటినుంచో అరుణాచల్ ప్రదేశ్ విషయం లో చైనా తగవు ఉండనే ఉంది. ఇపుడు ఈ తాలిబన్ల తలనొప్పి.
ఇలా ఇండియా పరిస్థితి చూస్తుంటే ఇజ్రాయెల్ పరిస్థితి లా ఉంది. ఇలా చుట్టూ శత్రుదేశాలు తో ఇజ్రాయెల్ ఎలా నెగ్గుకు వచ్చింది అనేది ఒక పాఠం లా తీసుకోవాల్సిన స్థితి ఇండియా ది. రక్షణ, మిలటరీ, గూఢచర్య వ్యవస్థలను సమన్వయం చేసి, ఆధునీకరించి, దేశానికి దుర్భేద్యమైన డిఫెన్స్ ఏర్పరిచి, శత్రువుల వెన్ను లో వణుకు పుట్టించే ఇజ్రాయెల్ ఇక ఇపుడు ఇండియా కు ఆదర్శ ప్రాయం కావాలి. ఇండియా స్థితి తెలిసిన ఇజ్రాయెల్ ఎప్పటి నుండో తగు సూచనలు అందిస్తూనే ఉంది, ఇంకా అందించడానికి సిద్ధంగానే ఉంది. కాబట్టి పరిస్థితి ని అర్థం చేసుకుని ఇండియా ఎంత త్వరగా ఇజ్రాయెల్ విధానం లోకి వెళితే అంత మంచిది దేశానికి.