Healthhealth tips in telugu

పాలలో కలిపి తాగితే 99% మోకాళ్ళ నొప్పులు,నరాల నొప్పులు తగ్గి జీవితంలో కాల్షియం లోపం ఉండదు

Joint Pains Home Remedies In Telugu : శరీరంలో నీరసం, అలసట నిస్సత్తువ వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటికి గల కారణాన్ని అన్వేషించాలి. ఏదైనా విటమిన్, ప్రోటీన్ల లోపం ఉందా అని పరీక్షలు చేయించుకోవాలి. ఇటువంటి సమస్యలు ప్రారంభ దశలో ఉంటే ఇంటి చిట్కాల ద్వారా బయటపడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

దీనికోసం పొయ్యి మీద గిన్నె పెట్టి వెలిగించి ఒక గ్లాసు పాలను పోయాలి కొంచెం వేడెక్కాక అర స్పూన్ సోంపు, దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు రెండు,చిన్న అల్లం ముక్క వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ పాలను వడకట్టి ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో తాగాలి. అవసరం అనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. అయితే డయబెటిస్ ఉన్నవారు బెల్లం వేసుకోకుండా తాగాలి.

ఈ విధంగా తాగడం వలన అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు నరాల బలహీనత అధిక బరువు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి

అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్ కడుపు ఉబ్బరం వంటివి కూడా తగ్గుతాయి అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది దాంతో మన శరీరం ఎటువంటి ఇన్ఫెక్షన్ గురికాకుండా ఉంటుంది. కాబట్టి ఈ పాలను ఒక వారం తీసుకుని ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి ఆ తరువాత మరొక వారం తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఉన్న అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి.