టైమ్ మిషన్ నేపథ్యంతో వచ్చిన సినిమాలు…ఎన్ని హిట్ అయ్యాయో…?
Time travel movies In Telugu : సినిమా రంగంలో ఒక్కోసారి జరిగే ప్రయోగాలు విజయం దక్కించుకుంటాయి. ఒక్కోసారి నిరాశ పరుస్తాయి. అయినా సరే, డిఫరెంట్ రోల్స్ లో చేయడానికి హీరోస్ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కుతాయి. ఆదిత్య 369తో బాలయ్య మంచి ప్రయోగం చేసాడు. టైం మిషన్ పేరిట సాగే కథనం ఆకట్టుకుంది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ కుదిరింది. 1991లో ఈ మూవీ రిలీజయింది.
ఇలాంటి కథలతోనే పలు సినిమాలు వచ్చాయి. ఫన్ 2ఇష్క్ పేరిట పరేష్ రావల్ బాలీవుడ్ మూవీ 2003లో రిలీజయింది. 2008లో లవ్ స్టోరీ 2050పేరిట హర్మాన్ బవేజా బాలీవుడ్ మూవీ వచ్చింది. అక్షయ కుమార్ నటించిన యాక్షన్ రీప్లే మూవీ 2010లో రిలీజయింది.
ఇక 2013లో బాలీవుడ్ మూవీ శ్రీ,2015లో విశాల్ హీరోగా వచ్చిన ఇండ్రు నేట్ర నాలై మూవీ కూడా టైం మిషన్ కథతోనే తెరకెక్కాయి. అలాగే 2016లో సిద్ధార్ధ్ మల్హోత్రా నటించిన బార్ బార్ దేఖో మూవీ కూడా అదే నేపథ్యంతో వచ్చింది. అదే ఏడాది సూర్య నటించిన 24మూవీ కూడా టైం మిషన్ నేపధ్యంలోదే.