MoviesTollywood news in telugu

4 కోట్ల అడ్వాన్స్ వాపసు చేసి షాకిచ్చిన నవీన్ పోలిశెట్టి

Tollywood Hero naveen polishetty :ఎజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ మూవీతో ప్రతిభ గల నటుడిగా నిరూపించుకున్న యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టిని వరుస ఆఫర్స్ వెన్నంటుతున్నాయి. ఈ మధ్య వచ్చిన జాతి రత్నాలు మూవీతో స్టార్‌డమ్‌ కూడా తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి గురించి తాజాగా ఓ షాకింగ్ వార్త వైరల్ అవుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌,యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసి అడ్వాన్స్‌ కూడా తీసుకున్నాడట. ఇందులో సితార ఎంటర్‌టైమెంట్‌ సంస్థ దగ్గర 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ గా అడ్వాన్స్ తీసుకున్నాడట. ఈ మూవీలో స్వీటీ అనుష్క నటిస్తోందని టాక్. అయితే ఈ తాజా వార్తలను బట్టి చూస్తే, నవీన్‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సినిమా కాన్సిల్‌ చేసుకుని అడ్వాన్స్‌ వాపసు చేసాడట.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, రంగ్‌ దే మూవీ కో డైరెక్టర్‌ కథ వినిపించగా నవీన్‌ పోలిశెట్టి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించాడట. మార్పులు చేసినా సరే, కథలో క్లారిటీ రాలేదట. దాంతో నవీన్‌ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం ద్వారా షాకిచ్చాడని టాక్. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు అగాలి.