యూట్యూబ్ లో సత్తా చాటుతున్న కార్తీక దీపం హీరో…రికార్డ్ స్థాయిలో…?
Manjula paritala youtube channel :ఈ మధ్య సినిమా స్టార్స్ తో పాటు బుల్లితెర స్టార్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నారు. అందులో భాగంగా బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
అలాగే హీరోయిన్ పాత్రలో వంటలక్కగా ప్రసిద్ధి చెందిన ప్రేమీ విశ్వనాధ్ అద్భుత నటన కనబరుస్తోంది. రాజేంద్ర కాపుగంటి డైరెక్షన్ లో కొత్త కొత్త ట్విస్ట్ లతో ఈ సీరియల్ విశేష ప్రజాదరణతో నడుస్తోంది. అయితే డాక్టర్ బాబుగా గుర్తింపు పొందిన నిరుపమ్ తన భార్య పేరు మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, రోజుకొక వీడియో అప్ లోడ్ చేస్తున్నాడు.
నిత్యజీవితంలో పలు అంశాలను యూట్యూబ్ లో షేర్ చేస్తున్న నిరుపమ్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే యూట్యూబ్ లో టాప్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాడు. తాజాగా తన భార్యకు కారు గిఫ్ట్ గా ఇచ్చిన విషయం గురించి ఓ వీడియో అప్ లోడ్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెట్టిన ప్రతి వీడియో లక్షల వ్యూస్ సంపాదించి చానల్ ఓ రేంజ్ లో దూసుకువెళ్ళుతుంది.