కొత్త సీరియల్ తో అభిమానుల ముందుకు వస్తున్న ముద్ద మందారం తనూజ
Mudda Mandaram serial Fame Tanuja new serial :జీతెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్ లో మేగోటి పార్వతిగా పరిచయమై తనూజ పుట్టస్వామి తన అందంతో,అభినయంతో విశేష ఆదరణ చూరగొంది. ఈ సిరియల్ మొదటి నుంచి మంచి టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకెళ్లింది. ఇక ఈ సీరియల్ లో నటించిన వాళ్లంతా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇందులో చేసిన నటీనటులు చాలా సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే పార్వతి పాత్రలో నటించిన తనూజ గౌడ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోగా, హీరోగా నటించిన పవన్ సాయి హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తనూజ, పవన్ సాయి బెస్ట్ కపుల్స్ గా బుల్లితెర ఆడియన్స్ నుంచి అభినందనలు అందుకున్నారు. పవన్ సాయి నాగభైరవి సీరియల్ లో చేస్తున్నప్పటికీ తనూజ ఎందులోనూ మళ్ళీ కన్పించలేదు.
అయితే జి తెలుగు ఈవెంట్స్ లో తనూజ కన్పించింది. ఇక సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటూ తన వర్కవుట్స్ పోస్ట్ చేస్తుంది. ఎందులో చేస్తోందో ఆమె ఇంతవరకూ చెప్పనప్పటికీ ఇటీవల జి తెలుగు యాజమాన్యం మాత్రం తనూజ ఈజ్ బ్యాక్ అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది వైరల్ గా మారింది. అగ్ని పరీక్ష సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ త్వరలో అభిమానుల ముందుకి రానున్నది.