MoviesTollywood news in telugu

హరికృష్ణ కెరీర్ లో బెస్ట్ సినిమాలు…మీరు చూశారా…?

Tollywood Actor Harikrishna :నటరత్న నందమూరి తారకరరామారావు తనయుడిగా 11ఏళ్ళ వయస్సులో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ తండ్రితో కల్సి కొన్ని సినిమాలు చేసి, విజయాన్ని అందుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, నిర్మాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో రాష్ట్ర మంతటా పర్యటించడానికి వీలుగా చైతన్య రథానికి సారధి అయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి గా కూడా పనిచేసిన హరికృష్ణ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి, ఓ రేంజ్ లో దూసుకెళ్లారు.

తొలి ఇన్నింగ్స్ తో పాటు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలు ధరించిన హరికష్ణ ఆడియన్స్ గుర్తుంచుకునే పాత్రల్లో జీవించారు.ఎన్టీఆర్ తో కల్సి కృష్ణావతారం మూవీలో చిన్ని కృష్ణుడుగా కన్పించి, తర్వాత తల్లా పెళ్ళామా, తాతమ్మకల,దానవీర సూర కర్ణ మూవీస్ లో నటించాడు. దానవీర సూర కర్ణ మూవీలో అర్జునిగా మెప్పించారు. మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ బాబు నిర్మించిన శ్రీరాములయ్య మూవీలో కామ్రేడ్ సత్యం పాత్రలో ఒదిగిపోయారు.

నాగార్జున,హరికృష్ణలతో వైవిఎస్ చౌదరి తీసిన సీతారామరాజు మూవీలో అన్నగా సీతయ్య పాత్రలో నటించారు. కృష్ణమనాయుడు మూవీలో ఇంటి పెద్ద కొడుకుగా నటించారు. ఇక వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన సీతయ్య సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో సీతయ్యగా దుమ్మురేపాడు. శివరామరాజు మూవీలో ఆనంద భూపతి గా మంచి నటన ప్రదర్శించారు. ఇందులో జగపతి బాబు తదితరులు ఈయనకు సోదరులుగా నటించారు. ఇక రైతు నాయకుడుగా టైగర్ హరిచంద్రప్రసాద్ మూవీలో పవర్ ఫుల్ రోల్ పోషించారు.