వేటగాడు సినిమాలో ‘ఆకుచాటు పిందె తడిసె’ పాట వెనక ఉన్న నమ్మలేని నిజాలు
Vetagadu Movie Aaku Chatu Pinde Tadise Song :అడవి రాముడు తర్వాత ఎన్టీఆర్,దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ అనగానే వేటగాడు మూవీ గుర్తొస్తుంది. రోజా మూవీస్ పతాకంపై ఎం అర్జున రాజు నిర్మించిన ఈ మూవీలో శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణ. ఇక ఇందులో ఆకుచాటు పిందె తడిసె సాంగ్ కి విశేష ఆదరణ లభించింది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్,శ్రీదేవి స్టెప్స్ తో పాటు శ్రీదేవి అందాలు ఆరబోసింది.
ఆరోజుల్లో ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కాంబినేషన్ అనగానే హిట్ కింద లెక్క. ఈ సినిమాలో కూడా చక్రవర్తి బాణీలు సూపర్భ్. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఆకుచాటు పిందె సాంగ్ లో ఒక చోట కత్తెర వేశారు. ఆకుచాటు పిందె తడిసె,కోక మాటు పిల్ల తడిసె అనే పల్లవిలో కోక మాటు పదానికి సెన్సార్ అభ్యంతరం తెల్పింది.
అయితే ఆ ప్లేస్ లో కొమ్మచాటు పువ్వు తడిసె అని రచయిత వేటూరి రాసి పంపడంతో ఆ మేరకు భర్తీ చేసారు. మూడు రోజులపాటు ఏవిఎం స్టూడియోలో షూట్ చేసిన ఈ సాంగ్ అప్పట్లో ఆధునిక వాన పాటలకు నాంది పలికింది. అయితే సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో శంకరాభరణం మూవీకి సాంగ్స్ రాసే పనిలో పడిన వేటూరి దృష్టికి తీసుకెళ్లడంతో మార్పు చేసి పంపారు.