అగ్గిపిడుగు సినిమా గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు
Aggi Pidugu Movie : టాలీవుడ్ లో జానపద సినిమాలకు కీలక సూత్రధారి బి విఠలాచార్య. 1960-70మధ్య ఆయన తీసిన సినిమాలు సూపర్ హిట్. జానపద బ్రహ్మగా గుర్తింపు పొందిన విఠలాచార్య ఆరోజుల్లోనే గ్రాఫిక్స్ మాయాజాలం చేసి చూపించారు. చాలా తక్కువ ఖర్చుతో తనదైన శైలిలో గ్రాఫిక్స్ చేయించేవారు. అదే ఇప్పుడైతే గ్రాఫిక్స్ కి కోట్లు కుమ్మరించాలి.
ఇక ఎన్టీఆర్ హీరోగా అగ్గిపిడుగు మూవీ విఠలాచార్య డైరెక్షన్ లోనే తీశారు. ఫ్రెంచి రచయిత రాసిన నవల ఈ సినిమాకు మూలం. పుట్టుకతోనే కల్సి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములను ఆపరేషన్ ద్వారా వేరు చేస్తారు. అయినా సరే, ఇద్దరూ ఒకేలా స్పందిస్తుంటారు. ఒకరు ఏం చేస్తే, రెండోవాళ్ళు అదే చేస్తారు. 1964లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్. ఇలా ఇద్దరు హీరోలు కనుక రాజశ్రీ, కృష్ణకుమారి హీరోయిన్స్.
విలన్ గా రాజనాల నటించారు. మొత్తం మూవీ వాహిని స్టూడియోలో షూట్ చేసారు. గుర్రం మీద సీన్స్ విషయంలో,ఫైటింగ్ విషయంలో ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. రాజన్ నాగేంద్ర సంగీతం అందించిన ఈ మూవీలో మూడు హిట్ సాంగ్స్ ఉన్నాయి. సినిమా హాయిగా చూసేలా చిత్రీకరించారు. ఇప్పటికీ ఈసినిమాకు క్రేజ్ ఉంటుంది. దటీజ్ అగ్గిపిడుగు.