ఈ స్పెషల్ సాంగ్ బ్యూటీ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
jagadam movie special song fame monalisa : జయతే అనే ఒడియా మూవీ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన మోనాలిసా పలు భోజ్ పూరి చిత్రాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ గుర్తింపు రాలేదు. దాంతో రూటు మార్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో జగడం మూవీలో ఐటెం సాంగ్ చేసి,యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
హీరోయిన్ గా బాలీవుడ్ లో ట్రై చేసినప్పటికీ మోనాలిసా కు ఛాన్స్ లు రాలేదు. తెలుగులో నాలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన ఈమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం హిందీ,భోజ్ పూరి భాషల్లో పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
కోల్ కత్తా పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు అంతర బిస్వాస్. చిన్నప్పుడే దత్తత ఇచ్చేయడంతో దగ్గర బంధువు పెంచి పెద్ద చేసాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మోనాలిసా గా పేరు మార్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా నిలదొక్కువాలన్న ఆశను నెరవేర్చుకోలేక పోయింది.ప్రస్తుతం హింది,భోజ్ పూరీ బాషలలో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో అవకాశం వస్తే నటించటానికి సిద్దంగా ఉంది.