యాంకర్ విష్ణుప్రియ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోందో తెలుసా ?
Top anchor vishnu priya Income : టాలెంట్ ఉండాలి కానీ ఏ రంగంలో నైనా రాణించవచ్చని చాలామంది నిరూపిస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీలకు ధీటుగా ఆదాయం అందుకుంటున్నారు. అందులో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు.
షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియ బుల్లితెరపై ఛాన్స్ తెచ్చుకుని యాంకర్ గా పాపులార్టీ తెచ్చుకుంది. తర్వాత సినిమాల్లో కూడా చేరి హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేసింది. అయితే ఈమె ఆదాయం బాగానే ఉందని టాక్. యాంకర్ గా బాగానే సంపాదించానని ఇటీవల చెప్పుకొచ్చింది.
తన ఫ్యామిలీ సెటిలయిందని విష్ణుప్రియ చెప్పింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా ఎక్కువ మొత్తాన్ని సంపాదిస్తోంది. సెలబ్రిటీలతో సమానమైన ఆదాయం పొందుతోంది. బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. తాజాగా జబర్దస్త్ షోలో మెరిసిన ఈ అమ్మడు నిజానికి బుల్లితెరకు ఈమధ్య దూరంగానే ఉంటోంది. ఆధ్యాత్మిక భావన, దైవ చింతన మెండుగా గల విష్ణుప్రియ రుద్ర అనే ఫౌండేషన్ కూడా ప్రారంభించింది.