సెప్టెంబర్ 10 వినాయక చవితి రోజు ఈ సమయంలో పూజ చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి
vinayaka chavithi : మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు,పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి,మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకూండా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టిన రోజు అని కొందరు ఆలా కాదు గణాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు.
ఈ సంవత్సరం 2021లో సెప్టెంబర్ పదో తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజు శుభ తిథి ఉదయం 12:18 గంటలకు ప్రారంభమై రాత్రి 9:57 గంటల వరకు ఉంటుంది. గణేష్ చతుర్థి పూజా శుభ ముహుర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:33 గంటల వరకు ఉంటుంది.
వినాయక చవితి రోజున చందమామను చూడకూడదనే ఒక ఆచారం ఉంది. పురాణాల ప్రకారం ఈరోజు చంద్రుడిని దర్శించుకోవడం నిషేధించారు. ఒకవేళ పొరపాటున మీరు చందమామను చూస్తే మీకు శాపం తగిలే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలంటే.. తర్వాతి రోజు తెల్లని వస్త్రాలు, తెల్లని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచిదని నమ్ముతారు.