పెళ్లి సందడి సినిమాతో పోటీ పడిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Pelli Sandadi Movie : హీరోగా శ్రీకాంత్ కి తొలిరోజుల్లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మూవీ పెళ్ళిసందడి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అశ్వినీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో రవళి,దీప్తి భట్నాగర్ హీరోయిన్స్. ఈ మూవీలో కీరవాణి అందించిన సంగీతంతో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. హాస్యం,ఎమోషన్ మేళవించిన ఈ సినిమాలో దర్శకేంద్రుని మార్క్ సాంగ్స్ అలరించాయి. కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ 27సెంటర్స్ లో 175డేస్ ఆడింది. షిఫ్ట్ లతో 53సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 10సెంటర్స్ లో 200రోజులు ఆడింది.
ఈ మూవీకి పోటీ వచ్చిన మూవీస్ విషయానికి వస్తే, వెంకటేష్ నటించిన ధర్మచక్రం మూవీ పెళ్ళిసందడి మర్నాడు జనవరి 13న రిలీజయింది. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో వెంకీ నటన అద్భుతం. అయితే ఎబో ఏవరేజ్ అయింది. పవర్ ఫుల్ లాయర్ పాత్రలో వెంకీ అద్భుత నటన కనబరిచాడు. ఎం ఎం శ్రీలేఖ సాంగ్స్ సూపర్ హిట్. బెస్ట్ యాక్టర్ గా వెంకీ నంది అవార్డు తెచ్చుకున్నాడు. పెళ్లి సందడి సినిమాకి ఒక్కరోజు ముందుగా సాంప్రదాయం మూవీ రిలీజయింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ చేసారు.
ఇంద్రజ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఇక పెళ్లి సందడికి తక్కువ గ్యాప్ లో వంశానికొక్కడు మూవీ వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ,ఆమని హీరోయిన్స్. శరత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బాలయ్య నటన సూపర్. కోటి సంగీతం అందించాడు. బాలయ్య తండ్రి పాత్రలో కైకాల సత్యనారాయణ జీవించారు. 53కేంద్రాల్లో 50డేస్ ఆడిన ఈ మూవీ 12సెంటర్స్ లో 100రోజులు ఆడింది. కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది.