‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Nuvvu naaku nachav movie :ఒకరితో చేయాల్సిన సినిమా వివిధ కారణాల వలన మరొకరితో చేయాల్సి రావడం సినిమా ఇండస్ట్రీలో మామూలే. ఇక కె విజయ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించిన చిత్రం ఇది. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసింది.
నిజానికి కథ రాస్తున్నప్పుడే త్రిష, గజాల హీరోయిన్స్ గా పెడితే మంచిదని అనుకున్నారట. ఫ్రెష్ లుక్ కోసం ఆర్తిని తీసుకున్నారు. అంతేకాదు, నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో విజయ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేయాలని స్రవంతి రవికిశోర్ భావించారు.
తరుణ్ తోనే చేయాలనుకున్నా, పెద్ద సబ్జెక్ట్ కనుక వెంకటేష్ అయితే మంచిదని తీసుకున్నారు. ఇక కథ రాసే సమయంలో బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు. వెంకటేష్ సూచన మేరకు ఈ క్యారెక్టర్ అదనంగా చేర్చారట. ఇందులో ప్రకాష్ రాజ్, హీరోయిన్ చెల్లెలుగా సుదీప,సునీల్ తదితరులు ఈ సినిమాలో తమ నటనతో అదరగొట్టారు.