రామ్ చరణ్ వాచీ ధర తెలిస్తే షాక్ అవ్వాలసిందే…!
Ram Charan Watch Cost :సినిమా హీరో,హీరోయిన్స్ వాడే వస్తువులు,కట్టే బట్టలు,నడిపే బైక్స్, కార్లు ఇలా ఒకటేమిటి అన్నీ కాస్ట్లీ గానే ఉంటాయి. వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు వాడతారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు ఇట్టే వైరల్ గా మారుతున్నాయి. ఇక ఫాన్స్ కి ఖుషీగా ఉంటోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాడుతున్న వాచీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
దాంతో దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకీ విషయం లోకి వెళ్తే, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకలో చెర్రీ ధరించిన వాచ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది. సహజంగానే ఫాన్స్ దృష్టి కూడా ఆ వాచీ మీద పడడంతో నెట్ లో ఆరా తీశారు.
మొత్తానికి అది ..రిచర్డ్ మిల్లె ఆర్ ఎం 61-01 యోహన్ బ్లేక్ మోడల్ వాచీగా తేల్చారు. ఒలంపిక్స్‌లో 100, 200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్ సాధించిన యోహన్ బ్లేక్ కోసం రిచర్డ్ మిల్లే కంపెనీవారు ఈ వాచ్‌ని ప్రత్యేకంగా రూపొందించారట. దీని ధర 1,24,500 యూరోలు. భారత్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 1కోటి రెండు లక్షలు. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో,గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ ఉండడం విశేషం.