‘F2’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Tollywood Hero Nani :విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 80కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 షూటింగ్ చేసుకుంటోంది. అయితే ఈ మూవీలో వరుణ్ తేజ్ కి బదులుగా మరో హీరోని కాంటాక్ట్ చేశారట.
అతడెవరో కాదు, నేచురల్ స్టార్ నాని. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నానికి కొంచెం బ్రేక్ పడింది. అయితే ఎఫ్ 2లో ఛాన్స్ వస్తే, ఇతర సినిమాల్లో బిజీ వలన ఎఫ్ 2 వదులు కొన్నాడట. ఈ విషయాన్ని నాని స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని నటించిన టక్ జగదీశ్ ఓటిటిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బిగ్ స్క్రీన్ మిస్సవుతున్నానని చెప్పాడు.
తమిళ్ లో అట్లీ డైరెక్షన్ లో వచ్చిన రాజారాణి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆర్య,నయనతార,జై,వజ్రియా నజీమ్ నటించిన ఈ మూవీ తెలుగులో రిలీజై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీలో ఛాన్స్ వస్తే, ఇతర సినిమాల వలన బిజీ కావడంతో ఒప్పుకోలేదని అలా రెండు హిట్ మూవీస్ మిస్సయ్యానని నాని చెప్పుకొచ్చాడు.