వెంకీ బ్లాక్ బస్టర్ రాజా సినిమాకు పోటీగా నిలిచిన సినిమాల పరిస్థితి…?
Venkatesh raja movie : విక్టరీ వెంకటేష్ కెరీర్ లో క్లాసికల్ మూవీగా అటు క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా అలరించిన రాజా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. తమిళ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ లో వెంకీ సరసన సౌందర్య నటించింది. ముప్పలనేని శివ డైరెక్షన్ లో 1999మార్చి 18న వచ్చిన ఈ మూవీ రజతోత్సవం చేసుకుంది.
ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం సూపర్భ్. మొదటి వారం కోటి 89లక్షల షేర్ కలెక్ట్ చేసింది. సూర్య వంశం రికార్డ్ ని బ్రేక్ చేసింది. అయితే ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలను పరిశీలిస్తే, రాజేంద్ర ప్రసాద్,ఇంద్రజ జంటగా నటించిన చిన్ని చిన్ని ఆశ మూవీ రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో వచ్చింది. రాజా మూవీ రిలీజ్ రోజునే వచ్చి,డిజాస్టర్ అయింది.
శ్రీకాంత్,రమ్యకృష్ణ నటించిన ఇంగ్లీషు పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు మూవీని రుద్రరాజు సురేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. ఏవరేజ్ అయింది. దీంతో పాటే మార్చి 12న దేవి మూవీ వచ్చింది. ప్రేమ,భానుచందర్,వనిత తదితరులు నటించిన ఈ మూవీకి కోడి రామకృష్ణ డైరెక్టర్.అత్యద్భుతంగా గ్రాఫిక్స్ తో కూడిన ఈ మూవీ రాజా ప్రభావం నుంచి తప్పించుకుని విజయాన్ని దక్కించుకుంది.
ఇక ఆర్ తులసి కుమార్ డైరెక్షన్ లో జెడి చక్రవర్తి,రాశి జంటగా నటించిన హరిశ్చంద్ర మూవీ మార్చి 12నే వచ్చింది. ఇదీ పెద్దగా ఆడలేదు. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన యమజాతకుడు మూవీ కి ఎన్ శంకర్ డైరెక్టర్. రాజేంద్రప్రసాద్ యముడిగా నటించాడు. సాక్షి శివానంద్ హీరోయిన్. మొదటివారం మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ రాజా మూవీ రాకతో వేగం తగ్గి, ఏవరేజ్ అయింది. రాజా బ్లాక్ బస్టర్ ముందు దేవి సూపర్ హిట్ అయింది.