MoviesTollywood news in telugu

ఆదిపురుష్ హీరోయిన్ కారు రేటు ఎంతో తెలుసా ?

kriti sanon new car Cost : సినీ సెలబ్రిటీలు కొనే వస్తువులు, కార్లు, బైక్ లు, వాచీలు ఇలా అన్నీ బ్రాండెడ్ కంపెనీలకు చెందినవే కొంటారు. రేటు చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. సంపాదనకు తగ్గట్టు సౌకర్యవంతమైన వాటిని కొనుగోలు చేసి వాడుతుంటారు. సోషల్ మీడియాలో వీటి గురించి వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.

బాలీవుడ్, టాలీవుడ్ అగ్ర నటులు నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న కృతి సనన్ ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలు చేసినా హిట్ రాలేదు. తగిన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ లో చేస్తోంది. మిమి అనే బాలీవుడ్ సినిమాలో చేసిన ఈమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆదిపురుష్ తో పాటు హమ్ దే హమారే దో,గణపత్,బేధియా,బచ్చన్ పాండే వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె వార్తల్లోకి ఎక్కింది. ఆమె కొన్న కారు అంత్యంత ఖరీదైనది కావడమే ఇందుకు కారణం. దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలు కంపెనీల కార్లు కృతి సనన్ దగ్గర ఉండగా తాజాగా మెర్సీడెస్ కంపెనీకి చెందిన ‘మే బాచ్ జి ఎల్ ఎస్ 600’ కారు కూడా కొనేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కారు విలువ దాదాపుగా 2 కోట్ల రూపాయిలు అని సమాచారం.