MoviesTollywood news in telugu

బాలకృష్ణతో 7 సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్…ఎన్ని హిట్స్…?

Tollywood Hero Balakrishna :ఒకప్పుడు తెలుగు వెండితెరపై నటరత్న ఎన్టీఆర్,దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు,మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్. ఎన్టీఆర్,దర్శకేంద్రుడి కాంబినేషన్ లో వచ్చిన 12సినిమాలు సూపర్ హిట్. అడవిరాముడు,వేటగాడు మొదలుకుని మేజర్ చంద్రకాంత్ వరకూ అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్స్ అందుకున్న దర్శకేంద్రుడు ఎందుచేతనో నందమూరి బాలకృష్ణతో తో పెద్దగా హిట్స్ కొట్టలేకపోయాడు.

ఎన్టీఆర్,బాలయ్య లు కల్సి నటించిన రౌడీ రాముడు, కొంటెకృష్ణుడు మూవీ తో బాలయ్య, రాఘవేంద్రరావు కాంబినేషన్1980లో స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఇక బాలయ్యతో కల్సి దర్శకేంద్రుడు విడిగా తెరకెక్కించిన పట్టాభిషేకం అనుకున్న విజయం సాధించలేక పోయింది. ఇందులో విజయశాంతి హీరోయిన్. అలాగే బాలయ్య డబుల్ రోల్ చేసిన అపూర్వ సహోదరులు మూవీ కూడా దర్శకేంద్రుని దర్శకత్వంలోనే వచ్చింది. విజయశాంతి,భానుప్రియ హీరోయిన్స్. అయినా ఈ మూవీ హిట్ దక్కించుకోలేకపోయింది. అలాగే సహస సామ్రాట్ కూడా ఫెయిల్ అయింది.

బాలయ్య, రాధ జంటగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన దొంగరాముడు ఫెయిల్ అయింది. అయితే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అశ్వినీదత్ నిర్మించిన అశ్వమేధం మూవీ కూడా దెబ్బకొట్టింది. బాలయ్య,శోభన్ బాబు,మీనా,నగ్మా నటించిన ఈ మూవీ తీవ్ర నిరాశ పరిచింది. ఇక పాండురంగడు మూవీ కూడా ప్లాప్ అయింది. టబు హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో కళాతపస్వి కె విశ్వనాధ్ కూడా నటించారు. అయినా ఈ సినిమా హిట్ సాధించలేకపోయింది. తండ్రి ఎన్టీఆర్ కి ఎన్నో హిట్స్ ఇచ్చిన దర్శకేంద్రుడు ఎందుచేతనో బాలయ్యకు హిట్స్ అందించలేకపోయాడు.