స్టాలిన్ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Chiranjeevi Stalin Movie :మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగుదాస్ కథను సిద్ధం చేసి డైరెక్ట్ చేసిన స్టాలిన్ మూవీ అభిమానులను,ఆడియన్స్ ని విశేషంగా అలరించింది. అక్క మాట జవదాటని తమ్ముడు పాత్రలో చిరంజీవి మెప్పించాడు. అక్కగా ఖుష్బూ నటించింది. 2006సెప్టెంబర్ 20న విడుదలైన ఈ మూవీ 394సెంటర్స్ లో 500కి పైగా ప్రింట్స్ తో రిలీజైన ఈ మూవీ వారంలోనే 20కోట్లు రాబట్టింది.
నాగబాబు నిర్మించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అదనపు ఆకర్షణ. ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాల విషయానికి వెళ్తే, స్టాలిన్ కి వారం గ్యాప్ తో సెప్టెంబర్ 27న రిలీజైన నాగార్జున నటించిన బాస్ మూవీ కి వి ఎన్ ఆదిత్య డైరెక్టర్. బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. నయనతార, పూనమ్ బజ్వా,శ్రేయ హీరోయిన్స్.
సెప్టెంబర్ 29న నవదీప్ నటించిన సీతాకోక చిలుక రిలీజయింది. షీలా హీరోయిన్. ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఇదే రోజున ముమ్ముట్టి నటించిన మహానగరంలో మాయగాడు మూవీ మలయాళ డబ్బింగ్. నయనతార హీరోయిన్. సినిమా ప్లాప్ అయింది. కార్తీక్,వేణు,సీరియల్ యాక్టర్ కరుణ నటించిన ప్రామిస్ మూవీ నిరాశ పరిచింది.
ఇక స్టాలిన్ కి ముందుగా వచ్చిన మూవీస్ చూస్తే సెప్టెంబర్ 15న గంగ మూవీ రిలీజయింది. ఇది కూడా ఫెయిల్ అయింది. వేణు హీరోగా ఇల్లాలు ప్రియురాలు మూవీ సెప్టెంబర్ 14న రిలీజయింది. ఇది కూడా ప్లాప్ గా మిగిలింది.ఇదే రోజున రామ్ గోపాల్ వర్మ శివ 2006మూవీ డిజాస్టర్ గా మిగిలింది. హీరోయిన్ నిషా కొఠారి గ్లామర్ తో ఆకట్టుకుంది.
సెప్టెంబర్ 14న వచ్చిన వనజ మూవీ తక్కువ బడ్జెట్ తో అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కింది. అవార్డుల పంట పండించిన ఈ మూవీ ఫీల్ గుడ్ గా నిల్చింది. అయితే థియేటర్లలో ఫెయిల్ అయింది. ఇక మా ఇద్దరి మధ్య మూవీ సెప్టెంబర్ 12న వచ్చింది. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అలరించిన సినిమా ఆడలేదు. సూర్య నటించిన నువ్వు నేను ప్రేమ మూవీ సెప్టెంబర్ 8న వచ్చింది. జ్యోతిక హీరోయిన్. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది.