ఇలా చేస్తే 99% మోకాళ్ళ నొప్పులు,joint pains, నడుం,కండరాల నొప్పులు పూర్తిగా తగ్గి జీవితంలో ఉండవు
Joint pains Home Remedies In Telugu :ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. నొప్పులను తగ్గించటానికి పుదీనా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పుదీనా ఇప్పుడు విరివిగా లభ్యం అవుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువే.
పుదీనాను కేవలం రుచికి, వాసనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకూ,సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి కూడా సహాయ పడుతుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,విటమిన్ C,విటమిన్ D,విటమిన్ E,విటమిన్ B,క్యాల్షియం,పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి.
ఏదైనా నొప్పి వచ్చినప్పుడు వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలతో పరిష్కారం చేసుకోవచ్చు.
దీని కోసం 10 పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీటిని పోసి అరగంట అలా వదిలేసి ఆ నీటిని వడకట్టి తాగాలి. నీటిని వడకట్టిన తర్వాత ఉడికిన పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో అర స్పూన్ సొంఠి పొడి, అర స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ అవ నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని.నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ తో కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసే ఉదయం ఆ. కట్టు తీసేస్తే ఒకటి రెండు రోజుల్లోనే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనాతో చెప్పిన ఈ రెండు రెమిడీలను పది రోజుల పాటు చేస్తే అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.