మట్టి గాజులు పద్మావతి రియల్ లైఫ్…తల్లి కూడా హీరోయిన్…?
Matti gajulu serial actress Padmavati : జెమిని టివిలో ప్రసారమవుతున్న మట్టి గాజులు సీరియల్ వీక్షకులను బాగా ఆకట్టు కుంటోంది. తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయింది. ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న పద్మావతి తన అందం,అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. 2017 వరకూ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఈమె సీరియల్ హీరోయిన్ గా మారింది.
పద్మావతి అసలు పేరు ప్రగతి. కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది. తెలుగులో మట్టిగాజులు మొదటి సీరియల్ అయినప్పటికీ ఆమె బాగా నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రగతి తండ్రి చంద్ర వ్యాపారం చేస్తుంటారు. కన్నడలో తన యాక్టింగ్ తో మంచి ఆదరణ చూరగొన్న హేమకళ ఆమె తల్లే. తల్లి యాక్టర్ కావడంతో ప్రగతికి కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. దాంతో 1వ తరగతిలో ఉండగానే సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్టుగా కన్నడలో నటించింది.
నటిగా యాక్ట్ చేయడం వలన స్కూల్, కాలేజ్ డేస్ మిస్సయ్యానని చెప్పింది. ప్రస్తుతం ఇంటర్ ప్రయివేట్ గా చదువుతోంది. అరసి సీరియల్ లో ఈమె యాక్టింగ్ కి మంచి పేరు రావడంతో కన్నడ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే ఈ సీరియల్ లో ఈమె యాక్టింగ్ చూసి, భావన కుమార్ తెలుగులో మట్టిగాజులు సీరియల్ లో ఛాన్స్ ఇచ్చాడు. నెగెటివ్ షేడ్ లో యాక్ట్ చేయాలని ఉందని చెప్పింది. మట్టిగాజులు సీరియల్ తో పాటు కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తోంది.