డాన్ శీను సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో…?
Ravi teja don seenu Movie: ఇండస్ట్రీ ఓ మాయాజాలం. ఒకరిని హీరో అనుకుంటే మరొకరు సెలెక్ట్ అవుతారు. ఫలానా హీరోయిన్ కావాలని వెయిట్ చేస్తే, మరో హీరోయిన్ ని పెట్టుకోవాల్సిన పరిస్థితి కన్పిస్తుంది. తీరా అది హిట్ అయ్యాక ఓ మంచి సినిమా మిస్ చేసుకున్నామని బాధ వెంటాడుతుంది. అదేవిధంగా డాన్ శీను మూవీ కథ గురించి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి డైరెక్టర్ గోపీచంద్ మలినేని వినిపించాడట..
కథ బాగానే ఉందని, సినిమా చేద్దామని కూడా ప్రభాస్ ఒకే సూచాయగా ఒకే చెప్పాడట. అయితే అదే సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేస్తున్నందున వెంటనే ఒకే చెప్పలేక పోయాడు. దాంతో హీరో గోపీచంద్ కి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి రిలేషన్ కూడా ఉండడంతో అతడికి వినిపించాడట. కథ నచ్చి, సినిమా చేయడానికి హీరో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ పడింది. నిర్మాతగా దిల్ రాజు ని ఎంచుకోవడంతో కథ అడ్డం తిరిగింది. ఈ సినిమా గోపీచంద్ కన్నా రవితేజ కు బాగా సూటవుతుందని దిల్ రాజు చెప్పడం,అదే సమయంలో గోలీమార్ మూవీలో గోపీచంద్ ఉండడంతో రవితేజను కాంటాక్ట్ చేయడం,ఒకే చేయడం జరిగిపోయాయి. సినిమా హిట్ అయింది.