ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood veteran heroine kamna jethmalani : సినిమా ఇండస్ట్రీ అనేది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఎంత అందం ఉన్నా,అభినయం ఉన్నా అదృష్టం కల్సి రాకపోతే అంతే సంగతులు. పలు సినిమాల్లో నటించి రణం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ ఆతర్వాత ప్రాణం మూవీతో కూడా పర్వాలేదనిపించింది.
అయితే తర్వాత పెద్దగా కామ్నా జెఠ్మలానీ సినిమాలు ఆడలేదు. 2015లో చంద్రిక అనే తెలుగు మూవీలో నటించిన తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు. ప్రస్తుతం కన్నడలో గరుడ అనే మూవీలో చేస్తోంది. ఈమె బెంగూళూర్ కి చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలను తగ్గించుకొని కుటుంబానికి ప్రాదాన్యత ఇచ్చింది. ఈమెకు ఒక కొడుకు,కూతురు ఉన్నారు.
అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మార్చుకుని,ఎక్సర్ సైజులు చేయడం వలన కామ్నా జెఠ్మలానీ బాగా బరువు తగ్గిందట. స్కిన్ షో చేస్తున్న ఫోటోలను తన అధికారిక ఇన్ ష్టా గ్రామ్ లో అప్ లోడ్ చేయడంతో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బరువు తగ్గిన ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుందో లేదో చూడాలి.