అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ శకుంతల రియల్ లైఫ్
Ammaku teliyani koilamma serial actress shakunthala :అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ ఆడియన్స్ ఆదరణ చూరగొంటోంది. ఇందులోని నటీనటులు తమ అందంతో,నటనతో అలరిస్తున్నారు. ఇందులో శకుంతల తన నటనతో ఆడియన్స్ మదిని దోచింది.
గోరింటాకు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన శకుంతల అసలు పేరు కావ్యశ్రీ. డిసెంబర్ 13న కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జన్మించింది. బీఎస్సీ పూర్తిచేసిన కావ్య తండ్రి పేరు నటరాజ్. ఈయన బోర్ వెల్స్ బిజినెస్ చేస్తారు. తల్లిపేరు భాగ్య. ఈమె గృహిణి. కావ్యకు ఓ చెల్లెలు ఉంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టపడే కావ్య చదువుతో పాటు డాన్స్ నేర్చుకుంది.
స్టడీస్ పూర్తయ్యాక తల్లి కోరిక మేరకు కావ్య యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. కన్నడ టివి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. నీలి,మహాకాళి,నాయకి వంటి కన్నడ సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు బుల్లితెరపై గోరింటాకు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి శ్రీవల్లీ క్యారెక్టర్ లో నటించి,మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం శకుంతలగా అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ లో నటిస్తూ మంచి ఆదరణ చూరగొంటోంది.