మెగాస్టార్ తో పోటీ పడి డాన్స్ చేసిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?
Tollywood Heroine Radha :నటరత్న ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చండశాసనుడు మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అలనాటి గ్లామర్ హీరోయిన్ రాధ ఆ తర్వాత అప్పటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. స్టెప్స్ వేయడంలో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా ఉండేది. పరుచూరి బ్రదర్స్ కథ,మాటలు అందించిన చండశాసనుడు మూవీలో నటించిన రాధ ఆతర్వాత చిరంజీవికి పరుచూరి బ్రదర్స్ అందించిన కథలకు ఈమె హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసింది.
మెగాస్టార్ సరసన ఒకప్పుడు రాధిక, మాధవి, ఆతర్వాత విజయశాంతి, రాధ బాగా కుదిరారు. స్టెప్స్ వేయడంలో చిరంజీవిని అందుకునేలా హీరోయిన్స్ ఉండాలి కనుక అందుకు తగ్గట్టు హీరోయిన్స్ కూడా జతచేరారు. ఇక కొండవీటి దొంగ మూవీలో అయితే విజయశాంతి, రాధ కూడా చిరంజీవితో పోటీ పడి నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు ఇలా అందరి సరసన కూడా రాధ మెప్పించింది.
పెళ్ళిచేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రాధ సెకండ్ ఇన్నింగ్స్ లో చాలామంది హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రాధ కూడా వస్తే బాగుంటుందని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు. పైగా ఒటిటి లో కూడా డిమాండ్ ఉన్నందున ఎంట్రీ ఇచ్చి అలరిస్తే బాగుంటుందని పరుచూరి గోపాలకృష్ణ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల తన కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి రాధ పరిచయం చేసింది.