MoviesTollywood news in telugu

మురళీ మోహన్ ని ఎంకరేజ్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Tollywood Hero Murali Mohan :సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఆడిషన్స్ లో పాల్గొనాలి, ఫోటో టెస్ట్ లో సెలక్ట్ అవ్వాలి. అన్నీ అయ్యాక సినిమా లో ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలీజవుతుందో, అది హిట్ అవుతోందో ప్లాప్ అవుతుందో .. ఇలా ఎన్నో ప్రశ్నలు కొత్త నటులకు సహజం. ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా సత్తా చాటి ఛాన్స్ లు దక్కించుకోవచ్చు. ఆ రోజుల్లో అయితే మరీ కష్టం. ఎక్కడో మద్రాసు వెళ్లి తమ అదృష్టం పరీక్షించుకోవాలి.

అయితే నటుడు మురళీమోహన్ స్టడీస్ పూర్తయ్యాక వ్యాపార లావాదేవీలు చేస్తున్న సమయంలో సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెళ్ళాలా వద్దా అనే సంశయం వచ్చింది. సినిమాల్లోకి వెళ్లాలని ఫ్రెండ్స్ సూచించారు. వ్యాపారాలు దెబ్బతింటాయని ఆలోచిస్తుంటే, మరి సూపర్ స్టార్ కృష్ణ ఇలాగే వెళ్లారు కదా అని ఫ్రెండ్స్ చెప్పారు.

దాంతో సినిమాల్లో చేయడానికి మురళేమోహన్ మద్రాసు వెళ్లారు. అప్పుడు జై ఆంధ్రా ఉద్యమం జరుగుతోంది. అందులో నటులు కూడా పాల్గొన్నారు. మిత్రుడు కృష్ణ కూడా ఆందోళన శిబిరంలో ఉండగా, మురళీమోహన్ వెళ్లి కలిసికున్నారు. ఎందుకు వచ్చావని అడగలేదు. కానీ మురళీమోహన్ సినిమాల్లో చేస్తుంటే, ఎప్పటికప్పుడు కృష్ణ ఆరా తీసేవారు. ఈ విషయాన్ని ఓ నిర్మాత స్వయంగా చెప్పడంతో మురళీమోహన్ ఆశ్చర్యపోయారు. దాంతో మిత్రుడు కృష్ణపై మరింత ప్రేమ పెరిగిందని మురళీమోహన్ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.