బిగ్ బాస్ లో చరణ్ ధరించిన జాకెట్ ఖరీదెంతో తెలుసా ?
Ram charan biggboss 5 jocket price : స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 5కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లినపుడు అతడు ధరించిన జాకెట్ గురించి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. డిస్ని హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోషన్ లో భాగంగా ఇలా కన్పించాడు. చరణ్ మన వినోద విశ్వం అంటూ ప్రోమో కూడా అలరించింది.
సాధారణంగా చరణ్ ధరించే వస్తువులు ఇటీవల బాగానే వైరల్ గా మారాయి. అతడు పెట్టుకున్న వాచీ, దుస్తులు, కార్లు ఇలా అన్నీ చర్చకు దారితీస్తున్నాయి. చరణ్ తో పాటు మాస్ట్రో మూవీ టీమ్ కూడా బిగ్ బాస్ షోలో సందడి చేసిన సంగతి తెల్సిందే. అయితే అతడి జాకెట్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది.
నెటిజన్స్ లో మామూలు రేంజ్ లో సెర్చ్ చేయరు కదా. అందుకే అతడి జాకెట్ గురించి విస్తృతంగా సెర్చ్ చేయడంతో ఆ జాకెట్ ధర ఒక లక్షా 30వేలు అని తేలిందట. బ్రాండ్ అంబాసిడర్ అన్నాక ఆమాత్రం ఉండాలి కదా అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఫాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.