డిఫరెంట్ రోల్స్ తో తెలివిగా ప్రవర్తించే క్యారెక్టర్స్ చేసిన హీరోలు
Tollywood Heroesintelligent Roles :ఒక మూసలో సినిమాలు వస్తే, జనం చూడరు. పైగా బోర్ కొడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు హీరోలను కొత్తగా, విభిన్నంగా కనిపించడానికి హీరోలు ఎంతగా ప్రయత్నిస్తారో, అలాగే కొత్తగా చూపించడానికి దర్శకులు శ్రమిస్తుంటారు. ఇటీవల తెలివితేటలతో వ్యవహరించే హీరోయిజాన్ని చూపిస్తున్నారు.
అందులో ముఖ్యంగా చేయని నేరాన్ని తనపై వేసిన విలన్స్ అటకట్టించడంలో అతడు మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన నటనతో అలరించాడు. నాన్నకు ప్రేమతో మూవీలో తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ప్రేమగా ఉంటారు. అయితే తండ్రి ప్రేమకోసం కొడుకుగా నాన్నకు ప్రేమతో మూవీలో జూనియర్ ఎన్టీఆర్ వినూత్నంగా నటించాడు.
జులాయి మూవీలో వేలకోట్ల రూపాయలను కొల్లగొట్టాలని ప్రయత్నించే విలన్ అటకట్టించడంలో హీరో అల్లు అర్జున్ చాలా తెలివిగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు.డ్రగ్ మాఫీయా అటకట్టించడంలో హీరో రామ్ చరణ్ ధ్రువ పాత్రలో అద్భుతంగా నటించాడు. అనుకోని విధంగా తన ఫ్యామిలీ మర్డర్ కేసులో ఇరుక్కుంటే తెలివిగా తన కుటుంబాన్ని కాపాడుకోవడంలో దృశ్యం మూవీలో విక్టరీ వెంకటేష్ నటన అద్భుతం. స్నేహితుడు మూవీలో తమిళ్ హీరో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా చూపించారు.
దొంగతనాలు చేయడంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ, కిక్ ఉండేలా చూసుకుంటూ ఆద్యంతం కిక్ మూవీలో రవితేజ అలరిస్తాడు. కేసులను పరిష్కరించడంలో విశాల్ నటన డిటెక్టివ్ సినిమాలో వెరైటీగా ఉంటుంది. ఏజంట్ శ్రీనివాస ఆత్రేయ మూవీలో నవీన్ పాత్ర చాలా తెలివితో కూడుకుని ఉంటుందని చెప్పవచ్చు. అలాగే అడివి శేష్ ‘ఎవరు’ మూవీలో చాలా తెలివిగా వ్యవహరించే పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.