శంకర్ – చెర్రీ కాంబోలో ఫైట్ కి ఖర్చు ఎంతో తెలుసా ?
Ram charan New Movie :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. పొలిటికల్ డ్రామాగా తీయబోయే ఈ సినిమా ఇప్పటీకే ఆర్ సి 15 టైటిల్ వర్కింగ్తో తీయడానికి ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత దిల్ రాజు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగనుంది.
గతంలో శంకర్ దర్శకత్వంలో తీసిన బాయ్స్ సినిమాతో సినీమా రాంగానికి ఎంట్రీ ఇచ్చిన తమన్ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెర్రీతో తీసే శంకర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా, శ్రీకాంత్,సునీల్, అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.
అయితే ఈసినిమాలో రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 10 కోట్లు వెచ్చిస్తున్నట్లు టాక్. దీంతో ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. కాగా చెర్రీ ఓ పక్క తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ షూటింగ్ నిర్మాణం పూర్తిచేయడమే కాకుండా, మరోపక్క దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించబోతున్నాడు.