తమిళ స్టార్ హీరో ధనుష్ పారితోషికం ఎన్నికోట్లో తెలుసా…?
Hero dhanush remunaration :అందం లేకున్నా అభినయంతో తమిళ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ధనుష్ తక్కువ సమయంలో స్టార్ హీరో అయ్యాడు. నిజానికి సినిమా రంగంలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేకున్నా, డైరెక్టర్ అయిన అతడి తండ్రి కస్తూరి రాజా వత్తిడి మేరకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.
తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ధనుష్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దాంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో డైరెక్ట్ తెలుగు మూవీ చేయడానికి ఒకే చెప్పాడు. ఒక్కో సినిమాకు 10 నుంచి 15కోట్లు అందుకుంటున్న ధనుష్ తెలుగు ఆడియన్స్ లో కూడా ఫాన్స్ ని సంపాదించుకున్నాడు.
తన టాలెంట్ తో స్టార్ హీరోగా వెలుగుతున్న ధనుష్ దాదాపు 180 కోట్లకు అధిపతి అయ్యాడని టాక్. ఇక ఇప్పటివరకూ ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసే తెలుగు మూవీకి ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ ను ఏషియన్ సినిమాస్ ఇవ్వడానికి రెడీ అయిందట. ఈ మూవీ తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.