దేవత సీరియల్ సత్య చెల్లి ఏమి చేస్తుందో తెలుసా ?
స్టార్ మా లో స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే పాపులర్ గా మారిన సీరియల్ దేవత. ఇందులో నటిస్తున్న సత్య తన అందంతో,అభినయంతో బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని, ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు వైష్ణవి. డిసెంబర్ 12న జన్మించింది. తండ్రి మెడికల్ రిప్రజంటేటివ్ కాగా,తల్లి డిజైనర్.
వైష్ణవి కి దుర్గ అనే చెల్లి ఉంది. సావిత్రమ్మగారి అబ్బాయి ,బంగారు పంజరం సీరియల్స్ లో నటిస్తోంది. తమ్ముడు విజయ్ సిన్హా కూడా నటుడే. ఎంబీఏ లో కరస్పాండెన్స్ పూర్తిచేసిన వైష్ణవి కి యాక్టింగ్ అంటే ఇష్టం. దాంతో స్టడీస్ పూర్తయ్యాక ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మంచి డాన్సర్ కూడా అయిన ఈమె షూటింగ్స్ లేనప్పుడు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది.
డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి ఆతర్వాత అల్లరే అల్లరి, సుడిగాడు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో ఇష్టం లేక సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. జీతెలుగులో పసుపు కుంకుమ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అమెరికా అమ్మాయి, అష్టా చెమ్మా, సుందరకాండ, ఇద్దరమ్మాయిలు, మధుమాసం, కెరటాలు, శిఖరం ఇలా పలు సీరియల్స్ లో చేసింది.