Movies

లేడీ గెటప్స్ తో అక్కినేని ఎంత వెనకేసారో తెలుసా?

ఆరోజుల్లో ఆడవేషాలు వేయడానికి హీరోలు వెనుకాడేవారు కాదు. పైగా రంగస్థలంలో హీరోయిన్స్ గా నటించడానికి వచ్చేవాళ్ళు తక్కువ ఉండడం వలన లేడీ గెటప్స్ వేయాల్సి వచ్చేది. ఇండస్ట్రీకి రెండుకళ్లుగా ఎన్టీఆర్, అక్కినేని గురించి చెప్పుకుంటాం. ఈ ఇద్దరిలో ఎవరికి వారే సాటి. ఎవరికి తగ్గ పాత్రలు వారు ఎంచుకుని రాణించారు. అయితే ఎన్టీఆర్ కన్నా ముందే అక్కినేని ఇండస్ట్రీకి వచ్చారు.

పేదకుటుంబంలో పుట్టిన అక్కినేని చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువు సంధ్యలు చెప్పించే స్థోమత లేక చదువుకోలేదు. కానీ పెద్దయ్యాక ఇంగ్లీషు నేర్చుకుని అనర్గళంగా మాట్లాడేవారు. చిన్నతనంలో పశువుల పాకలో పేడ ఎత్తి , పాలు పితికేవాడు. అలా ఇంటి ఖర్చులకు సొమ్ము ఇచ్చేవారు.

అయితే చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కావడంతో సొంతూరు గుడివాడ దగ్గర వెంకటాపురంలో నాటకాల్లో చేరారు. హరిశ్చంద్ర నాటకంలో నారదుడి పాత్ర అంటే ఇష్టం. కానీ చంద్రమతి వేషం వేయాల్సి వస్తే వేసి, రక్తికట్టించడంతో అప్పటి నుంచి ఆడవేషాలే వేసే ఛాన్స్ వచ్చింది. దాంతో అతడికి గిరాకీ పెరిగి సొమ్ములు కూడా బాగానే వచ్చేవట. తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి తొలినాళ్లలో పౌరాణిక, జానపద చిత్రాల్లో రాణించారు.