టాలీవుడ్ టాప్ యాంకర్ కూతురు ఎవరో చూడండి…గుర్తు పట్టారా…?
రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత వీర రాఘవ, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం, అ ఆ వంటి సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లో నటించిన ప్రముఖ నటి, యాంకర్ హరితేజ పలు సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. తాజాగా తన కూతురు పిక్స్ ని షోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
హరితేజ 2015లో దీపక్‌రావుని పెళ్లాడింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి, ఆ మధ్య బారసాల కూడా చేసింది. అలా ఆ పాపకు భూమి అనే పేరు పెట్టారు. భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపంవస్తే భూకంపమే అంటూ.. కూతురు పేరు వెనుక అర్థం కూడా హరితేజ సరదాగా చెప్పుకొచ్చింది. ప్యూర్ వైట్ గౌనులో ఉన్న భూమి దీపక్ రావ్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హరితేజ ఆ తర్వాత యాంకర్‌గా అవతారం ఎత్తి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్‌బాస్ తెలుగులో అడుగు పెట్టి, తన అల్లరితో, ఆటతో ఫాన్స్ కి మరింత దగ్గరైంది. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ముసి ముసి గా నవ్వుతూ క్యూట్ గా ఉన్న భూమి దీపక్ రావ్ ని చూసి ఫాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు