బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే ఒక లుక్ వేయండి
సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా జనాన్ని ఆకట్టుకోవడం సహజం. ఇక పుకార్లు,వివాదాలు సహజం. అయితే విస్తృతంగా సోషల్ మీడియా చొచ్చుకు రావడంతో సెలబ్రిటీలకు, వారి అభిమానులకు మధ్య బంధం మరింత బలపడుతోంది. తమ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు,సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి తమ అభిమానులతో సెలబ్రిటీలు ముచ్చటిస్తూ,ఫాన్స్ ప్రశ్నలకు తమదైన శైలిలో కొంటెగా, జోక్ గా బదులిస్తున్నారు.
తాజాగా ఓ అందాల నటి తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ నటి ఎవరా అని ఆరా తీసి, కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ఎవరో కాదు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఫైర్ బ్రాండ్ గా నిల్చిన కంగనా రనౌత్. తాజాగా తన తమ్ముడి పుట్టిన రోజు సందర్బంగా చిన్న తనంలో దిగిన ఓ ఫోటో షేర్ చేసింది. ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జతచేసింది. ఇటీవల జయ లలిత బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా..