Movies

1991లో రాజేంద్రప్రసాద్ సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా ?

1991 Rajendra Prasad Back to Back Hit movies : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన మూవీస్ లో పలు సినిమాలు హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా 1991లో వచ్చిన సినిమాల విషయానికి వస్తే, ముందుగా ఫిబ్రవరిలో వంశీ డైరెక్ట్ చేసిన ఏప్రియల్ 1 విడుదల మూవీ రిలీజై, తొలివిజయాన్ని నమోదు చేసింది. శోభన హీరోయిన్. అబద్దాలతో బతికే హీరో ప్రేమకోసం నెలంతా నిజాలు చెప్పి ఎలా ఎదురు దెబ్బలు తిన్నాడో ఈ మూవీ నిరూపిస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ అదనపు ఆకర్షణ.

రాజేంద్ర ప్రసాద్, నిరోషా నటించిన అత్తింట్లో అద్దె మొగుడు మూవీని రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేసారు. ఇదీ మంచి విజయాన్ని నమోదుచేసింది.
అలాగే రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేసిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. జెవి రాఘవులు సంగీతం ఆకట్టుకుంటుంది.

తర్వాత వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. దివ్యవాణి హీరోయిన్ గా చేసిన ఈ మూవీని కూడా రేలంగి డైరెక్ట్ చేసారు. వరుస హాస్య సినిమాలతో అలరించిన రాజేంద్ర ప్రసాద్ కొంచెం భిన్నంగా ఎర్రమందారం మూవీలో నటించి, నంది అవార్డు గెలుచుకున్నారు.
ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో యమున హీరోయిన్.

ఇక బాపు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి పుస్తకం మరో సూపర్ హిట్ మూవీగా నిల్చింది. రాజేంద్ర ప్రసాద్ సరసన దివ్యవాణి హీరోయిన్ గా చేసింది. కెవి మహదేవన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. ఇక కాట్రగడ్డ రవితేజ డైరెక్ట్ చేసిన కొబ్బరిబొండాం మూవీ మరో విజయాన్ని అందించింది. నిరోషా హీరోయిన్. అయితే ప్రేమ తపస్సు, మైనర్ రాజా, విచిత్ర ప్రేమ, తేనెటీగ మూవీస్ ఈ ఏడాది నిరాశపరిచాయి. 11సినిమాల్లో 7విజయాన్ని అందుకున్నాయి.