చిన్నప్పటి టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?
Tollywood Hero Vishnu :కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలతో విజయాలను అందుకున్న మంచు విష్ణు తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నటుడు ప్రకాష్ రాజ్ తో హోరాహోరీగా సాగిన పోరులో విష్ణు ఘన విజయం సాధించాడు.
గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన విష్ణు తాజాగా ఢీ అండ్ ఢీ మూవీలో నటిస్తున్నాడు. అలాగే సన్నాఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అయితే సెలబ్రిటీలకు సోషల్ మీడియా మంచి వేదిక అయింది.
దీంతో తరచూ తమకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీటిని ఫాన్స్ షేర్ చేయడం, కామెంట్స్ పట్టడంతో విపరీతంగా వైరల్ అవుతు న్నాయి. తాజాగా మంచు విష్ణు చిన్నప్పటి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.