Movies

మంచు విష్ణు భార్య భారీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

vishnu manchu wife viranica reddy :టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అలాగే బిజినెస్ లో సక్సెస్ సాధించాడు. అక్కినేని నాగార్జున తరవాత బిజినెస్ లో రాణించిన ఘనత విష్ణు సొంతం చేసుకున్నాడు. తాజాగా మా ఎన్నికల్లో ఘనవిజయం అందుకోవడంతో పాటు తన ప్యానల్ లో ఎక్కువ మందిని గెల్పించుకుని వార్తల్లో ఎక్కాడు.

అయితే మంచు విష్ణు భార్య విరనికా రెడ్డి గురించి చూస్తే ఆమెకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరి అవుతుంది. రాజారెడ్డి కుటుంబంలో ఈమె చిన్నమనవరాలు. రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతులకు జన్మించిన విరనికా అమెరికాలో పుట్టి పెరిగింది.విరనికా ఫ్యామిలీకి ఆఫ్రికాలో చాలా వ్యాపారాలున్నాయి.

చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట. విరనికా మంచి మనసు చూసి విష్ణు మనసు పారేసుకున్నాడు. అలా ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టడంతో పెద్దవాళ్ళు కూడా ఓకే చెప్పడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలున్నారు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైంలో కర్చీఫ్ ని కుట్టులేకుండా మాస్క్ లా ఎలా మలచుకోవాలో చెప్పి అందరిని ఆకట్టుకున్న విరనికా భర్త చాటు భార్య గానే ఉంటూ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం వెచ్చిస్తోంది. అయితే మిగిలిన వాళ్ళలా సోషల్ మీడియాలో ఈమె పెద్దగా కన్పించదు.