భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ చరణ్…ఎంతో తెలుసా?
Ram Charan remuneration : చిరంజీవి కొడుకు గా రామ్ చరణ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు . ప్రస్తుతం అన్న బిజీ హీరోలలో రామ్ చరణ్ ఒకడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది. శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ 90 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నిజమైతే ప్రభాస్ తర్వాత అత్యధికంగా పారితోషికం తీసుకునే హీరో రామ్ చరణ్ అవుతాడు.