MoviesTollywood news in telugu

పారితోషికం పెంచేసిన స్టార్ హీరోలు… ఎంతో తెలుసా ?

Tollywood Heroes remunerations : దర్శకుడు రాజమౌళి కారణంగా టాలీవుడ్ మార్కెట్ బాగా పెరిగిపోయింది ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలకు 70 కోట్ల వరకు మాత్రమే మార్కెట్ ఉండేది కానీ బాహుబలి విడుదల తర్వాత 100 కోట్లు,200 కోట్లు దాటేసింది అంతేకాకుండా తెలుగు సినిమాలు హిందీలో కూడా రీమేక్ అవుతున్నాయి. దాంతో మన హీరోలు కూడా ఎక్కువ పారితోషికం అడుగుతున్నారు. మన హీరోల పారితోషికాలు ఎలా ఉన్నాయో చూద్దాం

పవన్ కల్యాణ్ విషయానికొస్తే vakeel saab కి 50 కోట్లు తీసుకుంటే హరిహర వీరమల్లు సినిమా కి 65 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం

ప్రభాస్ ఒక్కో సినిమాకి 80 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు

మహేష్ బాబు మొన్నటి వరకు 50 కోట్లు తీసుకునేవాడు. ఇప్పుడు కొత్తగా చేసే సినిమాలకు 55 కోట్లు తీసుకోవడమే కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా అడుగుతున్నాడు

ఎన్టీఆర్ అయితే 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

రామ్ చరణ్ .RRR సినిమా కు 40 కోట్లు తీసుకుంటే తర్వాత చేసే సినిమాకు 45 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడు

చిరంజీవి ఆచార్య చిత్రానికి 35 కోట్లు తీసుకుంటున్నాడు

అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప రెండు పార్ట్ లకు కలిపి 65 కోట్లు డిమాండ్ చేశాడు అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో కూడా వాటా తీసుకుంటున్నాడు

బాలకృష్ణ మొన్నటి వరకు ఏడు కోట్లు తీసుకునే వాడు ఇప్పుడు పది కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు

నాగార్జున అయితే ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు

వెంకటేష్ మొన్నటి వరకు ఏడు కోట్లు తీసుకునే వాడు ఇక ఇప్పుడు 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు

8 కోట్లు తీసుకునే విజయ్ దేవరకొండ ఇప్పుడు పది కోట్ల పైగా డిమాండ్ చేస్తున్నాడు

8 కోట్లు తీసుకునే నాని 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు

వరుణ్ తేజ్ కూడా 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు

శర్వానంద్ 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు.