Healthhealth tips in telugu

తమలపాకు,మిరియాలు కలిపి తింటే ఏమి అవుతుందో తెలుసా?

Health benefits of chewing betel leaves with pepper : తమలపాకు,మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుకలుగుతాయి. గుండె ఆకారంలో ఉండే తమలపాకులలో విటమిన్ సి,థయామిన్, నియాసిన్, రిబో ఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. తమలపాకుతో రెండు మిరియాల గింజలు కలిపి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో సాధారణ పీహెచ్ స్థాయిలను పునరుద్ధరిస్తుంది కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు.జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. దాంతో జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలను గ్రహించటానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది.దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది

కీళ్ళ నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన నోటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. మిరియాలు,తమలపాకు కలిపి ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు.