అత్తారింటికి దారేది సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?
Pawan Kalyan Attarintiki Daredi Movie :మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. నదియా కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. సమంతతో లవ్ ట్రాక్, బ్రహ్మానందంతో కామెడీ అన్నీ కుదిరిన ఈ మూవీ 2013సెప్టెంబర్ 27న రిలీజయింది.
దీనికి రెండు వారాల ముందు నీడ మూవీ వచ్చింది. నయనతార నటించిన ఈ మూవీ మలయాళం నుంచి డబ్ అయింది. అయితే ఈ మూవీ నిరాశ పరిచింది. దిలీప్ కుమార్, ప్రియాంక నటించిన నా సామి రంగ మూవీ కూడా అదేరోజు వచ్చి ప్లాప్ అయింది. అదేరోజు వచ్చిన కమీనా మూవీ కూడా డిజాస్టర్ అయింది.
అత్తారింటికి దారేది మూవీకి రెండు వారాల ముందుగా పుటుక్కు జరజర డుబుక్కుమే మూవీ కూడా వచ్చింది. ఇదీ ఫెయిల్ అయింది. అదేరోజు గండికోటలో మూవీ వచ్చింది. ఇదీ డిజాస్టర్ అయింది. అడివి శేష్, ప్రియా బెనర్జీ నటించిన కిస్ మూవీ బిలో ఏవరేజ్ అయింది. అడవి శేష్ డైరెక్ట్ చేసాడు.
సెప్టెంబర్ 14న పోటుగాడు మూవీ వచ్చింది. మంచు మనోజ్ హీరోగా చేసిన ఈ మూవీ సెమీ హిట్ గా నిల్చింది. అత్తారింటికి దారేది మూవీకి వారం ముందు బ్రేక్ అప్ మూవీ వచ్చి, డిజాస్టర్ అయింది. వెల్ కం ఒబామా మూవీ ని సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. అయితే ఈ మూవీ కూడా నిరాశ పరిచింది.
సెప్టెంబర్ 20న వచ్చిన ఆర్ నారాయణ మూర్తి నిర్భయ భారత్ మూవీ మంచి సోషల్ మెసేజ్ ఇచ్చినా ఆదరణకు నోచుకోలేదు. యాక్షన్ కింగ్ అర్జున్ పోలీసాఫీసర్ గా నటించిన వీరప్పన్ మూవీ కన్నడకు అనువాదంగా వచ్చి ప్లాప్ అయింది. సెప్టెంబర్ 28న వచ్చిన డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ మూవీ డిజాస్టర్ అయింది.
ఇదేగా ఆశపడ్డావ్ బాలకృష్ణ మూవీ అక్టోబర్ 2న వచ్చింది. తమిళ్ నుంచి తెలుగుకి అనువాదం అయిన ఈ మూవీలో విజయ్ సేతుపతి నటించాడు. అయితే ఈ మూవీ నిరాశ మిగిల్చింది. అక్టోబర్ 4న వచ్చిన సహస్ర మూవీలో రాజీవ్ కనకాల నటించాడు. ఈ మూవీ కూడా ప్లాపయింది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా మూవీ అక్టోబర్ 11న వచ్చి, పరాజయం పాలయింది. ఇక రామ్ చరణ్ నటించిన తుపాన్ మూవీ కూడా అత్తారింటికి దారేది మూవీకి మూడు వారాల గ్యాప్ తో వచ్చి, డిజాస్టర్ గా మిగిలింది.