MoviesTollywood news in telugu

యాంకర్ శ్యామల నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా ?

Tollywood Anchor Syamala :తెలుగు బుల్లితెరపై పలువురు యాంకర్స్ తమ సత్తా చాటుతున్నారు. కాకినాడ లో పుట్టిన శ్యామల యాంకర్ గా బుల్లితెరపై దూసుకెళ్తోంది. నెలలో అన్ని రోజులూ యాంకరింగ్ లో బిజీగా మారిపోయింది. ఏం చెప్పారు శ్యామల గారు అనే యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువతో స్టడీస్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసింది.

భాగ్యనగరంలోని ఉద్యోగం చేస్తూ,సీరియల్స్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసిన శ్యామల 2010లో లయ సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించింది. సీరియల్స్ లో నటించడం తగ్గించి,అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది.

సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బుల్లితెరపై షోస్ చేస్తున్న యాంకర్ శ్యామల ఒక్కో ప్రీరిలీజ్ ఈవెంట్ కి 80వేలనుంచి లక్ష రూపాయల వరకూ అందుకుంటోందని టాక్. ఒక్కో సినిమాకు 2లక్షల నుంచి 5లక్షల దాకా అందుకుంటోందని అంటున్నారు. యాంకరింగ్ లో ఒక్కో ఎపిసోడ్ కి 20 నుంచి 25వేలు దాకా తీసుకొంటోందట. సినిమా ఇంటర్యూలు ఇలా అన్నీ కలిపి నెలకు 10లక్షల నుంచి 15లక్షలు అందుకుంటోందని టాక్