తమ స్నేహితులనే పెళ్లి చేసుకున్న 5 గురు టాప్ హీరోస్ వీరే
Tollywood Heros Who Married Their Girl Friend :పెళ్లంటే నూరేళ్ళ పంట. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్లు చూస్తే,ఎప్పుడు ఎలా ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలీదు. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా ప్రేమలో పడిపోతారు. ఇక టాలీవుడ్ లో కొందరు ప్రేమించి పెళ్లిచేసుకోగా,కొందరు తమ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకున్నారు.
అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. 2011లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరి ఫ్రెండ్ షిప్ ప్రేమకు దారితీసి, పెళ్లి పీటలు ఎక్కించింది. రామ్ చరణ్,ఉపాసన కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్ లో ఉపాసనను చూసి, ఫ్రెండ్ షిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడంతో 2012లో పెళ్లి చేసుకున్నారు.
తాజాగా డాక్టర్ పల్లవి వర్మను హీరో నిఖిల్ పెళ్లిచేసుకున్నాడు. ఫ్రెండ్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి, 2020మేలో పెళ్లి చేసుకున్నారు. అలాగే మిహికను దగ్గుబాటి రానా గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. వెంకటేష్ పెద్ద కూతురు ద్వారా పరిచయమైన ఈమెతో స్నేహం కాస్తా పెళ్ళికి దారితీసింది. కాగా హీరో నితిన్, షాలిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8ఏళ్ళక్రితం కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడి, ఐదేళ్లుగా ప్రేమించుకుంటూ, 2021జులైలో ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు.