త్రినయని సీరియల్ జాస్మిన్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల ఆస్తి…?
Trinayani Serial Villain jasmine Luxury Life : జి తెలుగులో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తున్న త్రినయని సీరియల్ లో జాస్మిన్ పాత్రతో నెగెటివ్ రోల్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈమె అసలు పేరు ప్రియాంక చౌదరి. అయితే ప్రియా,జాస్మిన్ అనే నిక్ నేమ్స్ తో పిలుస్తారు. 1994నవంబర్ 15న విజయవాడలో జన్మించిన ఈమెకు 27ఏళ్ళు పూర్తవుతాయి. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ. పైగా సినిమాలు ఎక్కువగా చూసి,నటనపై మరింత ఇంట్రెస్ట్ పెంచుకుంది.
విజయవాడ కృష్ణవేణి స్కూల్ లో చదువుకునే సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేది. తరువాత బిబిఎ పూర్తిచేసింది. నువ్వు చాలా అందంగా ఉంటావు కదా మూవీస్ లో ట్రై చేయమని ఫ్రెండ్స్ చెప్పడంతో ఇంట్లో ఒప్పించి, సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసింది. ఆడిషన్స్ కి వెళ్లి సెలక్ట్ కావడంతో శివకాశీపురం,సరోవరం,మా ఊరిలో నా ప్రేమ కథలో నటించింది.
అభిషేకం సీరియల్ లో నటించడం ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెరపై చాలా ఛాన్స్ లొచ్చాయి. త్రినయని సీరియల్ లో నెగెటివ్ షేడ్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న జాస్మిన్ హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లో ఉంటోంది. ఈమె నెట్ వర్త్ 5కోట్లు. ఎపిసోడ్ కి 20వేలు అందుకొంటోంది. అల్లు అర్జున్,మహేష్ బాబు,అనుష్క,కాజల్ అంటే ఈమెకు ఇష్టం. వైజాగ్ ఇష్టమైన ప్రదేశం.