ఈ టాలీవుడ్ భామలు పుట్టిన ఊరు ఏదో తెలుసా?
Non Local Tollywood Heroines Birth Places : హీరోయిన్ అనుష్క కర్ణాటకలోని మంగుళూరుకి చెందిన యువతి. నయనతార బెంగుళూరులో పుట్టిపెరిగిన కేరళ అమ్మాయి. హీరోయిన్ ఛార్మి మహారాష్ట్రలో జన్మించి హైదరాబాద్ లో సెటిలయింది. అత్తారింటికి దారేది సెకండ్ హీరోయిన్ ప్రణీత బెంగుళూరు భామ. హీరోయిన్ ప్రియమణి కర్ణాటకలోని బెంగుళూరు వాసి.
అ ఆ , ఉన్నది ఒక్కటే జిందగీ వంటి మూవీస్ తో అలరించిన అనుపమ పరమేశ్వరన్ మలయాళీ భామ. కెరలోని త్రిసూర్ జిల్లా ఇరింజర్ కొండ ప్రాంతం ఈమెది. రాజా ది గ్రేట్ వంటి మూవీస్ చేసిన మెహరీన్ కౌర్ పంజాబ్ యువతి. అమెరికాలో పుట్టి పెరిగిన మలయాళీ భామ అను ఇమ్మానియల్ పలు సినిమాలు చేసింది.
ఎక్స్ ప్రెస్ రాజా, బీరువా, జెంటిల్ మెన్ మూవీస్ తో ఆకట్టుకున్న సురభి ఢిల్లీలో పుట్టింది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ మూవీస్ చేసిన కైరా అద్వానీ ముంబయి భామ. బాలీవుడ్,టాలీవుడు హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రిటిష్ లోని హ్యాంగ్ కాంగ్ కి చెందిన భామ. హీరోయిన్ త్రిష చెన్నై భామ. హీరోయిన్ స్నేహ ముంబయి భామ. హెబ్బా పటేల్ కూడా ముంబయి భామలే.
హ్యాపీ డేస్ వంటి హిట్ మూవీస్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ముంబయి భామ. మగధీర వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన భామ. ఫిదా లాంటి సినిమాలతో ఫిదా చేసిన సాయిపల్లవి తమిళనాడులోని కోటగిరి ప్రాంతవాసి. రాశీఖన్నా ఢిల్లీ భామ. ఇస్మార్ట్ శంకర్ లో చేసిన నభా నటేష్ కర్ణాటకలోని శృంగేరి వాసి.
తాజాగా శ్రీకాంత్ తనయుడు హీరోగా వచ్చిన పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల బెంగుళూరు భామ. అయితే అమెరికాలో పుట్టి పెరిగింది. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి ముంబై భామ. కేథరిన్ తెరిస్సా మలయాళీ భామ. అయితే దుబాయిలో పుట్టి పెరిగింది.సమంత చెన్నై వాసి. శ్రేయ యూపీలోని హరిద్వార్ వాసి.
టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక మందన్న కర్ణాటకలోని విరాజ్ పేటకు చెందిన యువతి. మరో టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ముంబై భామ. నిత్యా మీనన్ బెంగుళూరు వాసి. అయితే ఈమె మలయాళీ భామ. అమలాపాల్ కేరళ వాసి. శృతి హాసన్ చెన్నై భామ. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చెన్నై భామ.
హన్సిక ముంబయి వాసి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి యూపీకి చెందిన అయోధ్య వాసి. పంజాబ్ కి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. హీరోయిన్ తాప్సి ఢిల్లీ వాసి. అలాగే ప్రేమ కావాలి, పూలరంగడు హీరోయిన్ ఇషా చావ్లా ఢిల్లీ భామ. అలాగే ఆర్ ఎక్స్ 100పాయల్ రాజ్ ఫుట్ కూడా ఢిల్లీ భామే. రెజీనా చెన్నై వాసి. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ భామ. ప్రజ్ఞా జైస్వాల్ కూడా జబల్ పూర్ వాసే. నివేదా థామస్ చెన్నై వాసి.