MoviesTollywood news in telugu

అనుష్క సినిమాలకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఇదే..!

Tollywood Heroine Anushka :స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూ లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ తో కూడా అదరగొట్టిన అనుష్క టాప్ రేంజ్ కి చేరుకొని, ఒక్కసారిగా మార్పు రావడంతో ఛాన్స్ లు తగ్గాయి. దీనికి కారణం సైజ్ జీరో మూవీ కోసం లావుగా మారడమే. అరుంధతి,భాగమతి, వేదం ఇలా లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో సత్తా చాటిన ఈ భామ సైజ్ జీరో మూవీ చేసి బాగానే ఆకట్టుకుంది.

కానీ లావుగా మారడంతో బాహుబలి మూవీలో కొన్ని సీన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డారన్న టాక్ వచ్చింది. అయితే స్లిమ్ గా మారాలనే ఉద్దేశ్యంతో ఫారిన్ వెళ్లి ట్రీట్ మెంట్ కూడా తీసుకుందన్న వార్తలు వచ్చాయి. అయినా ఇంకా స్లిమ్ గా తయ్యారవడంలో తేడా కొట్టడంతో ఛాన్స్ లు తగ్గాయి.

బాహుబలి తర్వాత అంతటి రేంజ్ మూవీస్ తో దూసుకెళ్లాల్సిన అనుష్క లావు కారణంగా వెనుకబడిపోయింది. ఈలోగా రష్మిక మందన్న, పూజా హెగ్డే ,కాజల్ అగర్వాల్ వంటి వాళ్ళు దూసుకొచ్చారు. అగ్ర హీరోల సరసన నటించి మంచి రేంజ్ కి వచ్చారు. అయితే స్లిమ్ గా మారి పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తున్న అనుష్క ఆశలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. మరోపక్క 35ఏళ్ళు రావడంతో పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ఎమౌంతుందో చూడాలి.