Healthhealth tips in telugu

ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దవారి వరకు పొట్టలో నొప్పి, గ్యాస్ ఒక్క రోజులో మాయం

Home remedies for gastric problem in Telugu : మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు గ్యాస్ కడుపునొప్పి అనేవి చాలా సాధారణం అయిపోయాయి. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్ ఎసిడిటీతో బాధపడేవారు ఎక్కువగా కడుపునొప్పితో బాధపడుతుంటారు ఈ సమస్య తగ్గడానికి మందులు కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు

వాములో ఉండే దైమొల్ గ్యాస్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది అందుకే మన పెద్దవారు కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు వామును ఔషధంగా ఇచ్చేవారు వాము తీసుకోవటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి అజీర్ణం గ్యాస్ సమస్యలు లేకుండా చేస్తుంది.

పావు స్పూను వాములో చిటికెడు సైంధవ లవణం లేదా ఉప్పు కలిపి నములుతూ రసాన్ని మింగాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో చేరిన గ్యాస్ త్రేన్పు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఇది రుచిలో కాస్త వగరుగా ఉంటుంది. వాము తీసుకున్నాక అర గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే సరిపోతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు కడుపు ఉబ్బరం సమస్య ఉన్నప్పుడు తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు వాము తీసుకుంటే సరిపోతుంది.

సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు సరిపోతాయి. వాము అనేది మన వంట గదిలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.