‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Kshemamga Velli Labhamga Randi Full Movie :కామెడీ ఎంటర్ టైనర్ గా 2000 ఫిబ్రవరి 4న రిలీజైన క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్,రాజేంద్ర ప్రసాద్,బ్రహ్మానందం,రోజా,రమ్యకృష్ణ,కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించారు.
రాజా వన్నెంరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, రవితేజ ప్రముఖ పాత్రలో కనిపిస్తారు. బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ మూవీకి నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 10న గణపతి మూవీ వచ్చింది. రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన ఈ సినిమాను హరిబాబు తెరకెక్కించారు. కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుని బిసి సెంటర్స్ లో బాగా ఆడింది.
ఇక అదేరోజు నాగబాబు,బ్రహ్మానందం,జయసుధ తదితరులు నటించిన హేండ్సప్ మూవీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఓ కామెడీ రోల్ లో కన్పిస్తారు. శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశపరిచింది. ఫిబ్రవరి 18న శ్రీకాంత్,వడ్డే నవీన్ నటించిన చాలా బావుంది మూవీ రిలీజయింది. ఇది కూడా శ్రీకాంత్ సినిమా కావడంతో తన సినిమాకు తానే పోటీ అయ్యాడు. మాళవిక కీలక పాత్రలో అదరగొట్టేసింది.బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఇక జనవరి 14న రిలీజైన కలిసుందాం రా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీలో సిమ్రాన్ హీరోయిన్. 38సెంటర్స్ లో 100డేస్ తో సెన్షేషన్ అయింది. ఉదయ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఎస్ ఏ రాజకుమార్ సంగీతం అలరిస్తుంది. కాగా అదేరోజు బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు మూవీ కూడా రిలీజయింది. దర్శకులు శరత్ తెరకెక్కించిన ఈ మూవీ నిరాశ పరిచింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ పెద్ద హిట్ అవ్వగా, దీనికన్నా హిట్ కొట్టి ఇండస్ట్రీ హిట్ గా కలిసుందాంరా నిల్చింది.