హైపర్ ఆది ఏడాది సంపాదన ఎంతో తెలుసా ?
jabardasth comedian hyper aadi assets : ఈటీవీలో చాలా ఏళ్లుగా నడుస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఏమాత్రం టిఆర్పి రేటింగ్ తగ్గకుండా ఇప్పటికీ టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ షో తో చాలామంది కంటెస్టెంట్స్ ఆర్ధికంగా స్థిరపడ్డమే కాకుండా,మిగిలిన షోస్ లో,సినిమాల్లో కూడా ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు.
కంటెస్టెంట్స్ లో హైపర్ ఆదికి మంచి ఇమేజ్ వచ్చేసింది. అతను వేసే పంచులకి అదిరిపోయే లెవెల్లో ఫాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ,ఢీ షోలలో కూడా తన సత్తా చాటుతున్నాడు.
ఇలా అన్ని రకాలుగా హైపర్ ఆది మంచి డిమాండ్ సంపాదించుకున్నాడు. ఇక రెమ్యునరేషన్ కూడా హై లెవెల్లోనే ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హైపర్ ఆది రెమ్యునరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. షోస్ తో పాటు సినిమాల్లో కూడా అలరిస్తున్నాడు.ముఖ్యంగా ఒక్క జబర్దస్త్ షో లెక్కేస్తేనే ఒక్కో స్కిట్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని, మొత్తం మీద ఒక ఏడాది ఆదాయం కోటి రూపాయలు మించిపోతుందని అంటున్నారు. ఈవెంట్‌ను బట్టి పారితోషికం డిమాండ్ చేసే ఆది, సినిమాలతో కలిపి బాగానే వెనకేసుకున్నట్లు టాక్.